ఖైరతాబాద్/బంజారాహిల్స్/హిమాయత్‌నగర్, నవంబర్ 14 : రాష్ట్రంలో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టాలని కోరుతూ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం ఖైరతాబాద్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందిరానగర్‌కాలనీ, డబుల్ బెడ్రూం, మహాభారత్‌నగర్, గాంధీనగర్, న్యూసీఐబీ క్వార్టర్స్, శ్రీనివాస్, నెహ్రూ నగర్, జాగిర్దార్బాడా, లక్ష్మీనగర్, పార్థివాడ తదితర బస్తీలో ఇంటింటికెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానంకు మహిళలు నిరాజనాలు పలికారు. పలువురు ఆడపడుచులు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని, రాష్ట్రమంతా కేసీఆర్ వెన్నంటి ఉన్నారని, అభివృద్ధి నినాదంతోనే ఓట్లు అడుగుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్ తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు పొందుపర్చారని, రూ.15లక్షల హెల్త్‌కార్డు, ఆరోగ్యబీమా పథకం, సమాఖ్య సంఘాలకు గృహాలు, సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు లాంటి అనేక బృహత్తరమైన పథకాలు రాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న, మాజీ కార్పొరేటర్ జి. కృష్ణా యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్ బాబు, మహేశ్ యాదవ్, ప్రవీణ్, రాజు, రాంరెడ్డి, బాక్సర్ అశోక్, తాండ్ర మేఘన, ఫకీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని లెజెండ్ సూరజ్ అపార్ట్మెంట్ వాసులతో పాటు అగర్వాల్ సమాజ్ సభ్యులతో ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థ పాలనే కారణమని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అగర్వాల్ సమాజ్ నాయకులు సురేందర్ అగర్వాల్, ముకుంద్ లాల్ అగర్వాల్, డా. అజయ్ అగర్వాల్, నావల్ బన్సల్, కైలాష్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.