కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 29: నిరుపేద కుటుంబాలలో పుట్టి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మేం బాలురకు ఏ మాత్రం తక్కువ కాదు అంటూ కష్టించి చదివే సంధ్య, ఇఫ్ఫాతున్నిసా లాంటి విద్యార్థినులను ప్రోత్సహిస్తూ ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్లో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ గఫ్ఫార్, సఫియా సుల్తానాకు..
ఒక కుమారుడు, ఒక కూతురు కాగా కుమారుడు ఇర్ఫానుద్దీన్ తండ్రికి పాన్‌షాప్ నిర్వహణలో చేదోడు వాదోడుగా నిలువగా.. కుమార్తె ఇఫ్ఫాతున్నిసాకు చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను బాగా చదివించాలనుకున్నారు. అయితే రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబానికి కుమార్తెను ప్రైవేటు పాఠశాలలో చేర్పించే స్తోమత లేదు.ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో4వ తరగతి వరకు చదివించారు.
గురుకులాల ఏర్పాటుతో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యావ్యవస్థలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన సమూల మార్పులతో 2017 లో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలో ఇఫ్ఫాతున్నిసా మౌలాలిలోని సనత్‌నగర్ గర్ల్స్-1 గురుకుల పాఠశాలలో సీటు సాధించి 5వ తరగతిలో చేరింది.
జీవితానికి మలుపు..
2017లో గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందిన ఇఫ్ఫాతున్నిసా అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలలేదదు. ప్రతీ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ 2023 ఏడాదిలో పదవ తరగతి పరీక్షలో 10/10 పాయింట్లు సాధించింది. అనంతరం అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగం తీసుకొని 2024 సంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. ప్రస్తుత 2025 సంవత్సరంలో జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో మొత్తంగా 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి స్టేట్ 5వ ర్యాంకును సాధించింది. ఈ క్రమంలో ఇఫ్ఫాతున్నిసా.. జగద్గిరిగుట్ట డివిజన్ మైనార్టీ అధ్యక్షులు అజం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను లువగా ఆమెకు ఆశీస్సులు అందజేశారు.
కేసీఆర్ దూరదృష్టితోనే..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. కేసీఆర్ గురుకులాలతో ఎందరో నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపారని అన్నారు. ఉన్నతవిద్యను పూర్తిచేసి పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కలలు కనే నిరుపేద విద్యార్థుల ఆశలకు కాంతి రేఖ అయి పెద్దలు కేసీఆర్.. గురుకుల పాఠశాల సంఖ్యను పెంచి, పౌష్టిక ఆహారం, మంచి విద్యకై చేపట్టిన ఎన్నో సంస్కరణలు నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపారన్నారు. ఇఫ్ఫాతున్నిసాకు నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.