జవహర్‌నగర్, సెప్టెంబర్ 14: డంపింగ్ దుర్వాసనను బీఆర్ఎస్ సర్కారు తగ్గిస్తే… కాంగ్రెస్ సర్కారు మరో చెత్త గుట్టను తెస్తూ..జవహర్‌నగర్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, కొత్తగా నిర్మితమవుతున్న పవర్ ప్లాంట్‌తో ప్రజలకు కంటి మీద కునుకులేకుండా పోతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్ 5వ డివిజన్ సత్యనారాయణపురం కాలనీలో బీఆర్ఎస్ నాయకులు దిలీప్, జక్కుల భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం ‘కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్‌నగర్ తన గుండెకాయ అని, అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ కార్పొరేటర్లు సంగీతా రాజశేఖర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.