రామంతాపూర్, జూన్ 13 : మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామంతాపూర్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో సందడి చేశారు. మహిళలు తయారు చేసిన పలురకాల ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. చిన్నారుల భరతనాట్యం, ఆటలు, పాటలు ఆహుతులను ఉత్సాహపరిచాయి. అనంతరం ప్రభుత్వ పథకాల వల్ల ఎంతో మంది యువకులు, మహిళలు ఉపాధి పొందుతున్నారని పలువురు మహిళలు కొనియాడారు.
అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1గా ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్లులాంటివి మహిళలకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి నోడల్ ఆఫీసర్ అరుణకుమారి, అధికారులు స్వర్ణలత, రమాదేవి, శ్రీనివాస్, మహిళా సంక్షేమ సంఘాల లబ్ధిదారులు, అంగన్వాడీ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ బీవీ చారి, గరిక సుధాకర్, మేకల ముత్యంరెడ్డి, రాజు, మాజీ కార్పొరేటర్ పావని, చాంద్‌పాషా, నందికంటి శివ, కృష్ణ, గాదె నిర్మలారెడ్డి, యాదమ్మ, ధనలక్ష్మి, భాగ్యరేఖ, తదితరులు పాల్గొన్నారు.