ఉప్పల్ జోన్ బృందం, మార్చి 8: ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సత్కరించారు. కాప్రా సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు శిరీషా సోమశేఖర్‌రెడ్డి, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్ హాజరై కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లకు, మహిళలకు స్వీటు తినిపించి, శాలువాలతో సత్క రించి.. శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం అన్నిరంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. మహిళా సాధికారత సాధన, సామాజిక అంశాల్లో మహిళలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో బుధవారం నుంచి ఈనెల 15వరకు వారం రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిళ్లవారీగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి.. అమలు పర్చనున్నట్లు తెలిపారు.
కాప్రా ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిడ్డల భవిష్యత్తు కోసం మాతృమూర్తుల కష్టాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువరాదని పేర్కొంటూ తన తల్లి బీడీలు చుట్టి పెంచి పోషించిన కారణంగానే తాను ఇంతవాడినయ్యానని తన స్వీయ అనుభవాన్ని వివరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు ఊర్మిళ, సబ్ ఇన్స్పెక్టర్ షఫీ, బీఆర్ఎస్ నాయకులు బేతాల బాలరాజు, సుదర్శన్‌రెడ్డి, ఏనుగు సీతారాంరెడ్డి, వంశరాజ్ మల్లేశ్, మహిళా పొదుపు సంఘాల సభ్యులు, రిసోర్సు పర్సన్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రామంతాపూర్, రాజేంద్రనగర్‌కు చెందిన 110 సంవత్సరాల వృద్ధురాలు మింగ శోభను కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు, జ్యోతిరావు ఫులే సేవా సంఘం అధ్యక్షుడు బుర్రా మహేందర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి అనిల్‌కుమార్, మహమూద్ బీబీ, ముత్తినేని జగదీశ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
స్ఫూర్తి కళాశాలలో మహిళలను , అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రాపర్తి సురేశ్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చిలుకానగర్‌లోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కేక్ కట్‌చేసి.. మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుభద్ర, నాయకురాళ్లు సరిత, లక్ష్మి, ఉమ, సత్యవతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బాలభారతి పాఠశాలలో 25 మంది మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు చైర్ పర్సన్ మక్కపాటి మంగళను సన్మానించారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ కపర్దీశ్వర్రావు, ట్రస్టు సభ్యులు సుదర్శన్ గౌడ్, జ్యోతి, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ వార్డు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి , కోటేశ్వరి, లక్ష్మి, మంజుల, తులసి, శోభ, సుమతి, మమత, పంతులమ్మ, సోనీ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బందిని మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్‌రెడ్డిలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ గోవింద్‌రెడ్డి, డీఐ వెంకటేశ్వర్లుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
డివిజన్, కైలాసగిరి చౌరస్తాలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్ద మాదిగ హక్కుల దండోరా దళిత రత్న అవార్డు గ్రహిత కందుకూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాకయ్య మాదిగ, జంగ మల్లేశ్, భాగ్యమ్మ, బొల్లం జ్యోతి, లక్ష్మక్క, రామక్క, డప్పు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.