చర్లపల్లి, జూన్ 18 : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి(Plant saplings) సంరక్షించాల్సిన బాధ్యత తీసుకొవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. మంగళవారం చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో మన బడి(Mana badi) కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు.
ఇల్లు లాంటి భూమాతను ఆరోగ్యకరంగా, ఆకు పచ్చగా ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో పర్యావరణంలో మార్పులు, కాలుష్య భూతమే ప్రపంచ మానవాళికి పేను సవాలుగా మారబోతుందన్నారు. ప్రమాదాన్ని గుర్తించి మొక్కలను నాటడంతో పాటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగిం చకుండా విద్యార్థులు కాలనీల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయుడు బాపురెడ్డి, నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, గుమ్మడి జంపాల్రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.