రామంతాపూర్, జూన్ 27: రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్లో నెలకొన్న సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) హామీ ఇచ్చారు. సైనిక్‌పురిలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలపై ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. కాలనీ ప్రధాన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ రోడ్స్, వర్షపు నీరు తదితర సమస్యల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, వెంకట్ రావు, కృష్ణమూర్తి, బుచ్చిరెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, ప్రభాకర్ యాదవ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.