ఉప్పల్, ఫిబ్రవరి 28: ఉప్పల్ భగాయత్లోని కాలభైరవ ఆలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయంలో అమావాస్య సందర్భంగా పూజలు నిర్వహిస్తున్నామని, ఆలయ అభ్యున్నతికి తన వంతు తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ బీఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావు, పిల్లి నాగరాజు, జెట్ట కిషోర్, అన్య బాలకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.