కాప్రా, జనవరి 6: ఉప్పల్‌ను సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం కాప్రా డివిజన్ సీఎస్నగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్లు వేయించాలని, డ్రైనేజీ సమస్య తీర్చాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాలనీలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరి నవీన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఎస్‌రావునగర్ డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో రూ.30లక్షలతో చేపట్టే కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు తదితరులు పాల్గొన్నారు.