మియాపూర్ , జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్ డివిజన్ల కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీనివాస్‌రావు, మాధవరం రోజాదేవి సహా పార్టీ నేతలు, కాలనీ సం ఘాల ప్రతినిధులు , సేవా సంస్థల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే గాంధీ నివాసానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రజలందరికీ సకల శుభములను కలుగ జేయాలని ఆకాంక్షించారు.
బంజారాహిల్స్,జనవరి 1: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ డిజిటల్ మీడియా వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు ఎమ్మెల్యే మాగంటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎర్రగడ్డ, జనవరి 1: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బోరబండ డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు సోమవారం కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ సీనియర్ నేత విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, సాయిబాబానగర్ సంక్షేమ సంఘం నాయకులు రమేశ్‌నాయక్, ఏడీ మధు, మోహన్, కుమారి, అలివేలు తదితరులు మాగంటిని కలిసిన వాళ్లలో ఉన్నారు.