శామీర్‌పేట, జనవరి 21: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దమర్రి గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేక గృహ అవసరాలకు కూడా నీరు దొరకడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు రవికాంత్‌రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిషారం కాలేదని తెలిపారు. తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.