మాదాపూర్, నవంబర్ 13: డిసెంబర్ 5న మాదాపూర్ నోవాటెల్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేయనున్న మిసెస్ మామ్స్ 2021 సీజన్ 5 కార్యక్రమానికి చెందిన లోగోను కిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఇందులో భాగంగా కిమ్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శిల్పిరెడ్డి వైద్య బృందం శివాని, సోనియా, చైతన్య, మాన్సి అగర్వాల్, సౌమ్య రాణి, సుదీప్తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శిల్పిరెడ్డి మాట్లాడుతూ కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 28న కార్యక్రమానికి చెందిన ఆడిషన్స్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 70 మంది పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. 3 నుంచి 9 నెలల గర్భంతో ఉన్న వారు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం గర్భిణులు 9503606049, 8247219948 గల నంబర్‌ను సంప్రదించాలని వైద్యురాలు శిల్పిరెడ్డి తెలిపారు. శరీరం, మనసు, ఆత్మ సంరక్షణ గురించి ఈనెల 29 న బ్రహ్మకుమారీలతో సమావేశం జరుగునున్నది. ఈనెల 28న ఆడిషనల్లో ఎంపికైన వారికి ఉచిత స్క్రీనింగ్‌తో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎవరికైన సమస్యలు ఉంటే వైద్యులు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి కంటెస్ట్‌లో పాల్గొనేలా చేయనున్నారు. మిసెస్ మామ్స్‌లో ఎంపికైన వారు ఫ్యాషన్ దుస్తులు కాకుండా చేనేత దుస్తులు ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేయనున్నారు. కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా ఆరోగ్య, పరిశ్రమమలకు చెందిన ప్రతినిధులు, వైద్య నిపుణులు పాల్గొననున్నారు.