మేడ్చల్ కలెక్టరేట్, జూలై 13 : అర్హులైన మైనార్టీ గ్రూప్ -1 అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.
దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 19 వరకు గడువు ఉన్నదని, 22వ తేదీ నుంచి తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాలకు 040-23236112 నంబర్లో సంప్రదించాలని సూచించారు.