హైదరాబాద్ : గాజుల రామారంలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానిక ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలు రావడంతో పలు పాఠశాలలో ఉన్న విద్యార్థులను స్కూల్స్ యాజమాన్యం ఇంటికి పంపించారు. గాజుల రామారం, మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10.17 ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు.
ఒక నిమిషం పాటు భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని, పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుండి భయంతో బయటికి పరుగులు తీశామని వివరించారు. కాగా, భూకంపం సంభవించినట్లు అధికారులు నిర్ధారించలేదు. ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా? లేదా ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు
గాజులరామారంలోని మెట్ఖాన్గూడా ప్రాంతంలో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని తెలిపిన స్థానికులు
దీంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుండి భయంతో బయటికి పరుగులు తీసిన స్థానికులు
ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేక ఇతర… pic.twitter.com/tHONI6xbl6
— Telugu Scribe (@TeluguScribe) February 10, 2026