Caste Census | కాచిగూడ : జనాభా గణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వేలాది మందితో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. కాచిగూడలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణనపై ప్రధానిపై బీజేపీ కేంద్ర మంత్రులు ఒత్తిడి తేవాలని, బీసీల భావితరాల కోసం మోదీ ప్రభుత్వం జనాభా గణనలో కులగణన చేపట్టాలన్నారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేయడానికి ప్రతిపక్ష, అన్ని రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని గంపెడాశతో మోదీని ప్రధానిని చేస్తే, బీసీలకు అన్యాయం జరుగడంతో పాటు వివక్ష కొనసాగుతుందని ఆరోపించారు. కులగణన కోసం దేశంలోని బీసీలందరు ప్రధాని మోదీ మెడలు వంచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.