హైదరాబాద్ : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్‌కు( Talasani Shankar Yadav) రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహన్ రెడ్డి నివాళులు(Ministers tributes,) అర్పించారు. సికిం ద్రాబాద్లోని SVIT ఆడిటోరియంలో నిర్వహించిన శంకర్ యాదవ్ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం శ్రీనివాస్ యాదవ్‌ను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. కాగా, అంతముందు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ప్రకాశ్ గౌడ్. మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.