వెంగళరావునగర్, అక్టోబర్ 2 : చేనేత కార్మికులకు(Handloom workers) ప్రభుత్వం అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. బధవారం అమీర్పేట్ కమ్మ సంఘంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పెషల్ ఈవెంట్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..చేనేత వృత్తులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని..ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
చేనేత వస్త్ర పరిశ్రమ కోసం పాటుపడిన వద్మశ్రీ అంజయ్య సలహాలు, సూచనలు తీసుకుని చేనేత పరిశ్రమను అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు కృషి చస్తానన్నారు. మిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్ వీవర్స్ సర్వీస్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ..దేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన విష్ణాతులైన చేనేత కార్మికులు సిల్క్,కాటన్ వస్ర్తాలు ఎక్స్పో లో ఉన్నాయని..ఈ నెల 15వ తేది వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు.