హైదరాబాద్ : కోల్కతాలోని శ్రీ కాళికామాత అమ్మవారిని సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రిని ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు.