పేదలకు చేరువలోనే.. బస్తీ దవాఖానలు
ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆరో వార్డు నందమూరి నగర్ కమ్యూనిటీ హాల్, ఎనిమిదో వార్డు లోతుకుంటలో బస్తీ దవాఖానలను బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్, మన్నె క్రిషాంక్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందిత, నివేదితతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ప్రారంభించారు.
- దూరం వెళ్లే ప్రయాస లేకుండా అందుబాటులోనే సర్కారు వైద్యం
- పైసా ఖర్చు లేకుండా 120 రకాల పరీక్షలు, మందులు
- ప్రజల ఆరోగ్యానికే మా ప్రాధాన్యం
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- కంటోన్మెంట్లో రెండు బస్తీ దవాఖానలు ప్రారంభం
- హాజరైన కార్పొరేషన్ చైర్మన్లు
- మన్నె క్రిషాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్
కంటోన్మెంట్, మే 22 : ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆరో వార్డు నందమూరి నగర్ కమ్యూనిటీ హాల్, ఎనిమిదో వార్డు లోతుకుంటలో బస్తీ దవాఖానలను బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్, మన్నె క్రిషాంక్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందిత, నివేదితతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతోనే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగిందన్నారు. పేదలకు వారి బస్తీలలోనే ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్తీ దవాఖానల ద్వారా పైసా ఖర్చు లేకుండా వైద్యం, 120 రకాల పరీక్షలు, మందులు అందించనున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల్లో డాక్టర్, నర్స్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం మంత్రి తలసానితో పాటు మర్రి రాజశేఖర్‌రెడ్డిని స్థానికులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటి, పలువురు వైద్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీగణేశ్, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, ప్రభాకర్, నళిని కిరణ్, నేతలు ముప్పిడి మధుకర్, ప్రభు గుప్తా, ప్రవీణ్‌యాదవ్, భాస్కర్, శేఖర్, విజయ్‌తో పాటు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలు
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. బొల్లారంలో వెయ్యి పడకల దవాఖాన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎక్కడికక్కడ మెడికల్ కళాశాలలు, ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యంను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని కొనియాడారు.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మల్కాజిగిరి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

