కార్తి జోడీగా?
ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిణామాలకు కథానాయిక త్రిష కేంద్రబిందువుగా మారింది. మరోవైపు ఆమె రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. అయితే ఈ విషయాలేవీ పట్టించుకోకుండా కొత్త సినిమా సన్నాహల్లో త్రిష బిజీగా ఉంది.
ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిణామాలకు కథానాయిక త్రిష కేంద్రబిందువుగా మారింది. మరోవైపు ఆమె రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. అయితే ఈ విషయాలేవీ పట్టించుకోకుండా కొత్త సినిమా సన్నాహల్లో త్రిష బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం కార్తి జోడీగా ఈ భామ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. మోహన్‌రాజా దర్శకత్వంలో కార్తి కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు.
త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమా కోసం కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం నయనతార, త్రిష పేర్లను ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నయనతార ప్రస్తు తం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆమె డేట్స్ సర్దుబాటు అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. దాంతో ఈ సినిమాలో త్రిష ను నాయికగా ఖరారు చేయబోతున్నారని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్న ది. ‘పొన్నియన్ సెల్వ న్’ చిత్రంలో కార్తి-త్రిష జోడీగా నటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

