Minister Srinivas Yadav | ఇంటింటికీ నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ జంటనగరాల ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
దేశం మొత్తం ఎంతో గొప్పగా చెప్పుకొనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తండాలు, గూడాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామన్నారు. నిండు వేసవిలో సైతం ఎక్కడా తాగునీటి సమస్య లేదన్నారు. గతంలో తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద, రోడ్లపై ఆందోళనలు, ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. ఓ విజన్ ఉన్న నాయకుడు పాలకుడైతే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు.