బేగంపేట్, ఏప్రిల్ 25 : బీజేపీ విష ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, కార్యకర్తలు ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆవిష్కరించారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సనత్‌నగర్ నియోజకవర్గమంతా నా కుటుంబమన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలన్నారు. రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారని అన్నారు. సనత్‌నగర్ నియోజవర్గంలో రిజర్వాయర్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రోడ్లు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, వైట్ ట్యాపింగ్ రోడ్లు, ఇండోర్ స్టేడియం, గ్రంథాలయం, బస్తీ దవఖాలు, శ్మశాన వాటికలు .. ఇలా ప్రతి అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. త్వరలోనే ఇంటి స్థలం ఉన్న వారికి రూ. 3 లక్షలు అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు.
బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజ్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రధాని అయితే దేశమంతా అభివృద్ధి అవుతుందని అన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికి ఓ మోడల్‌గా నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ తలసాని సాయికిరణ్‌యాదవ్, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు మహేశ్వరి, లక్ష్మీబాల్‌రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు కిరణ్మయి, ఉప్పల తరుణి, అరుణగౌడ్, ఆకుల రూప, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీహరి, పవన్‌కుమార్, మల్లిఖార్జున్‌గౌడ్, నరేందర్‌రావు, శేఖర్ ముదిరాజ్, బాల్‌రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.