సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): నగరంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. శుక్రవారం జరి గిన గాంధీనగర్, హబ్సిగూడ సమ్మేళనాల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, బేతి సుభాష్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో, గాంధీనగర్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి సీఎం కేసీఆర్‌కే ఉందని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ర్టానికి చేసింది ఏమీ లేదని అన్నారు. సమ్మేళనాలను ఈనెల 25వతేదీలోగా పూర్తి చేస్తామని చెప్పారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.