సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఒక మినీ భారతదేశమని, అలాంటి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వేలాది కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం హుస్సేన్‌సాగర్ తీరంలో సరికొత్త థీమ్‌లతో నిర్మించిన ఆధునిక పార్కును రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌తో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధేనని ఉద్ఘాటించారు.
అంతర్జాతీయ స్థాయిలో నగరంలో పలు రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా మంత్రి కేటీఆర్ నగరంలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేయించి వాటిని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా కార్యరూపం దాల్చేలా చేస్తున్నారని వివరించారు. ఇందులో రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ అద్భుతమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకు నిదర్శనం మురికి కూపంగా ఉండే లేక్ ఫ్రంట్ పార్కు ప్రాంతాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే మంత్రి కేటీఆర్‌తో పాటు పురపాలక, హెచ్ఎండీఏ అధికారుల కృషి ఎంతో ఉందన్నారు.
10 ఎకరాల స్థలంలో అద్భుతమైన పార్కును నిర్మించారని, సాగర్ చుట్టూ ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమర వీరుల స్మారక చిహ్నం ఇలా ఎన్నో ఉన్నాయని తెలిపారు. హెచ్ఎండీఏ గ్రేటర్లో అద్భుతమైన కార్యక్రమాలను చేపడుతోందని, ఇందులో ప్రధానంగా ఓఆర్ఆర్ చుట్టూ గణనీయంగా అభివృద్ధి చోటు చేసుకున్నదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోని అద్భుతమైన నగరాల్లో ఒకటిగా మారిందన్నారు. అద్భుతంగా పార్కు నిర్మాణం చేపట్టిన అధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతిలతో పాటు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

సాగర తీరంలో సరికొత్త థీమ్‌తో..
పచ్చని చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ నేరుగా నీటి పైకి ఎంచక్కా వెళ్లిపోవచ్చు. నీటి ఉపరితలం నుంచి 15 మీటర్ల ఎత్తులో చూస్తే అది ఒక అద్భుత దృశ్యంగా అలరిస్తుంది. ఇప్పటి వరకు సాగర్ చుట్టూ ఉన్న పార్కులకు పూర్తి భిన్నంగా లేక్ ఫ్రంట్ పార్కును తీర్చిదిద్దారు. నగర వాసులకే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు ఎన్నో విశేషాలను అందించే హుస్సేన్‌సాగర్ ఇప్పుడు సరికొత్త హంగులతో నగర వాసులను ఆకట్టుకునేందుకు లేక్ ఫ్రంట్ పార్కు అందుబాటులోకి వచ్చింది. హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటి వరకు హైదరాబాద్ మహానగరంలో ఎన్నో పార్కులు ఉన్నా, వాటికి పూర్తి భిన్నంగా అత్యాధునిక డిజైన్లు, సాగర తీరంలో సరికొత్త అనుభూతిని పొందేలా ఇందులో నీటి పైకి వెళ్లేలా రెండు చోట్ల ఏర్పాటు చేసిన బోర్డు వాక్‌లు ప్రత్యేక
ఆకర్షణగా నిలుస్తాయి.
లేక్ ఫ్రంట్ పార్కు ఫీచర్లు..