మారేడ్పల్లి/ఉస్మానియా యూనివర్సిటీ/బొల్లారం, డిసెంబర్ 25: సికింద్రాబాద్, కంటోన్మెంట్లలో క్రిస్మస్ వేడుకలు ఆదివారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు.
సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్, సెయింట్ జాన్స్, వెస్లీ, సెంటనరీ బాపిస్టు చర్చి, మెథడిస్టు చర్చిలలో ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఒకరికికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను జరుపుకున్నారు.