అబిడ్స్ : సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాంకోఠిలోని వెస్లీ చర్చిలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతే సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్, ఆర్వి మహేందర్ కుమార్, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, ముఖేష్‌సింగ్, రాంచంద్ర రాజు, నాయకులు దిలీప్గనాతే, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.