హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణనాథులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దిల్ సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం సాయిబాబాను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం P&T కాలనీలో గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ గణనాథుడిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్వహకులు సన్నీ యాదవ్, మాజీ కార్పొరేటర్ సామా ప్రభాకర్ రెడ్డి, విఠల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా నాగోల్ లోని బాలాజీ నగర్ లో తిరంగా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి మంత్రి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు సాయి ముదిరాజ్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.