లండన్ పర్యటనలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అకడి తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాల పండుగ బ్రోచర్‌ను మంత్రి ఆవిషరించగా, నిర్వాహకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంసృతికి ప్రతీకగా నిలిచే బోనాలు, ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగలను అనేక దేశాలలో నిర్వహించడం మనకెంతో గర్వకారణం అన్నారు.
మనం ఎక్కడ ఉన్నా మూలాలను మరువద్దని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమని, అనేక సంస్థలు, కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.