త్వరలో పేద ప్రజల కల సాకారం
నూతన సంవత్సరంలో పేద ప్రజల కల సాకారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మారేడ్‌పల్లిలోని న్యూ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ లీజు స్థలాల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- మారేడ్‌పల్లి న్యూ క్లబ్లో ప్రభుత్వ లీజు స్థలాల లబ్ధిదారులతో సమావేశం
మారేడ్‌పల్లి, డిసెంబర్ 19: నూతన సంవత్సరంలో పేద ప్రజల కల సాకారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మారేడ్‌పల్లిలోని న్యూ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ లీజు స్థలాల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 760 ప్రభుత్వ లీజు స్థలాలు ఉన్నాయని, సుమారు 2600 కుటుంబాలు ఆ స్థలాల్లో నివసిస్తున్నాయని తెలిపారు. వారిలో 700 మందికి జీఓ 816 కింద రెగ్యులరైజ్ చేశామని, వివిధ కారణాలతో మిగిలిన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారని చెప్పారు.క్యాబినెట్ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లగా, దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అమయ్ కుమార్, సీసీఎల్ఏ అధికారి కిషన్‌రావు, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్టేట్ ఆఫీసర్ ఆదిలక్ష్మి, న్యూ క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్‌రావు, వైస్ ప్రెసిడెంట్ మహేందర్, ట్రెజరర్ మధుసూదన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

