హైదరాబాద్ : తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇతర కులాలకు భిన్నంగా సగర కులం ఏకమై ఒకే సంఘంగా ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలలోని అన్ని కులాలకు కావాల్సిన పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
సగరులకు కులవృత్తి నిర్మాణ రంగం పై ఆధారపడ్డ జాతిగా గుర్తించి ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ల విధానంతో ఇఎండి లు లేకుండా పనులు కేటాయించడం కేసీఆర్ ప్రభుత్వం గొప్పతనమని అన్నారు. భవిష్యత్లో మరిన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సగర సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్.బి. ఆంజనేయులు సగర, రాష్ట్ర సగర మహిళా సంఘం కోశాధికారి పల్లవి సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి రాము సగర, రాష్ట్ర ప్రచార కార్యధర్శి సతీష్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర తదితరులు పాల్గొన్నారు.