సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు చాలా తకువమంది ఉంటారు. ఒక విభాగంలో సత్తా చాటడమే కష్టం అనుకుంటే పలు విభాగాల్లో తనదైన మార్తో ప్రేక్షకులతో మన్ననలు అందుకుంటారు కొందరు. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ కోవకు చెందిన వ్యక్తే. దర్శకుడిగా బాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాల్ని తెరకెకించిన ఆయన ఆ తర్వాత నటుడిగా మారి అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ తన వ్యక్తిగత జీవితంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
53 ఏండ్ల అనురాగ్, వయసులో తన కంటే 23 ఏండ్లు చిన్నదైన శుభ్రా శెట్టి (30)తో ఉన్న రిలేషన్షిప్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. శుభ్రా శెట్టితో రిలేషన్షిప్ ప్రారంభంలో ఎదురైన మానసిక సంఘర్షణ గురించి ఆయన స్పందిస్తూ…‘మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా నన్ను ఆందోళనకు గురిచేసింది. రోజురోజుకూ నా వయసు పైబడుతుంటే, ఆమె ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు, ఇప్పటికీ చిన్నపిల్లలాగే ఉంటుంది.
ఈ వ్యత్యాసం చూసి నేను చాలా అభద్రతా భావానికి లోనయ్యాను. ఆ సంకోచంతోనే ఒకానొక దశలో ఆమెతో బంధాన్ని తెంచుకుని దూరంగా వెళ్లిపోవాలనుకున్నా’ అని చెప్పుకొచ్చాడు. అయితే ఆమెతో సమయం గడిపేటప్పుడు ఆ వయసు వ్యత్యాసం ఎప్పుడూ గుర్తుకురాలేదని, ప్రస్తుతం ఇద్దరం ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్లు తెలిపాడు. ఈ మధురమైన అనుబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోనని అనురాగ్ స్పష్టం చేశాడు. శుభ్రాకు సంప్రదాయ వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదని చెప్పుకొస్తూ.. బంధానికి వివాహం అనే ఒక ముద్ర వేయడం కంటే, ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ, పరస్పర ఆనందం ఉండటమే అత్యంత ముఖ్యమైన విషయమని అభిప్రాయపడ్డాడు.