వనస్థలిపురం, సెప్టెంబర్ 7 : శతాబ్దాల క్రితమే సామాజిక న్యాయం కోసం పోరాడిన సామాజిక విప్లవకారుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సాహెబ్‌నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని గురువారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాపన్న చరిత్రను నేటి తరం అధ్యయనం చేయాలన్నారు.
భువనగిరి, గోల్కొండ కోటలను ఆక్రమించి బహుజన రాజ్యాన్ని స్థాపించారన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సంఘం అధ్యక్షుడు కొత్త రాం మహేశ్వర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న, నాయకులు కుంట్లూర్ వెంకటేశ్ గౌడ్, కొత్త రవీందర్ గౌడ్, కొత్త శ్రీధర్‌గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, వెంకన్నగౌడ్, నీళ్ల అంజన్‌కుమార్ గౌడ్, కొత్త భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.