
హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ – 2022 ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్, అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు శివ నాగేశ్వరరావు, తెలంగాణ అధ్యక్షుడు కూరేళ్ల వేములయ్య గౌడ్, జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, రాష్ట్ర కోశాధికారి పల్లె శ్రీనివాస్ గౌడ్, వివిధ జిల్లాల అధ్యక్షుడు కొండా గిరి గౌడ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మా గౌడ్, దీపాదేవి, శ్రీలత గౌడ్, బాలరాజు, యాలందర్, రాజు, శ్యామ్, అనిల్ గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.