ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 29: ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఓయూ విద్యార్థులకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. ఓయూ స్పోర్ట్స్ క్లస్టర్ ప్రారంభానికి వచ్చిన మంత్రిని విద్యార్థులు ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులతో మాట్లాడుతూ యూనివర్సిటీ సమస్యలు, ఫెలోషిప్‌ల సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, విద్యార్థి నాయకులు రవి కుమార్ గౌడ్, నవీన్ గౌడ్, రాజు యాదవ్, మంతెన మధు, ఆజాద్, వేల్పుకొండ రామకృష్ణ, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.