సిటీబ్యూరో/కొండాపూర్: తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను శుక్రవారం మంత్రి శ్రీధర్‌బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. కాగా, మాగంటి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో రెండు రోజులుగా వెంటిలెటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉన్నట్లు దవాఖాన వర్గాలు స్పష్టం చేశాయి.