కాచిగూడ, ఏప్రిల్ 30: దేశ భవిష్యత్‌కు పునాదిలాంటి పిల్లల జీవితాలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర గణనీయమైందని మంత్రి సీతక్క అన్నారు.మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గురువారం కాచిగూడ బస్ టెర్మినల్‌లో బేబి ఫీడింగ్ కేంద్రం, పిల్లల దత్తత కేంద్రాన్ని ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రి సీతక్క, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తల్లులు పిల్లలకు కనీసం సంవత్సరం పాటు తల్లిపాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రభుత్వంలో మహిళల సాధికారిత, శిశువుల సమగ్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా పిల్లల దత్తత కావాలనుకునే వారు కాచిగూడ రైల్వేస్టేషన్లో ఐసీడీసీ సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ రాజశేఖర్, హైదరాబాద్ రీజియన్ మేనేజర్ సుధా పరిమళ, డిప్యూటీ ఆర్ఎం బాబునాయక్, కాచిగూడ బస్‌డిపో మేనేజర్ వెంకటేశ్వర్లుతో పాటు అయోధ్య రాములు, భీష్మాదేశ్, ఓం ప్రకాశ్‌యాదవ్, బబ్లూసింగ్, అంటో, మహేశ్‌కుమార్, రాజేశ్, శ్రీకాంత్‌యాదవ్, బబ్బి, తదితరులు పాల్గొన్నారు.