Drugs | సైదాబాద్, మార్చి 22 : యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సైదాబాద్ జైలు గార్డెన్ ఆవరణలోని తెలంగాణ జువైనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం పైఅంతస్తులో తెలంగాణ డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాల బాలలకు తెలంగాణ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ను శనివారం ఆమె ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి సరిగా జువైనల్లో డి అడిక్షన్ సెంటర్ ప్రారంభించామని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ మహమారి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి నివారణ చర్యలు తీసుకునేందుకు సెంటర్ ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ క్రాంతి వెస్లి, తెలంగాణ డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్, చైల్డ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్ శైలజ, జువైనల్ హోం డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ చారువాక, సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణా రవీందర్ రెడ్డి, పర్యవేక్షణ అధికారులు నవీన్ కుమార్, అఫ్జల్, జ్వాల తదితరులు పాల్గొన్నారు.