ఆర్కేపురం, జూలై 20: కష్టపడే వారికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేజ్-2లో నివాసముండే బీజేపీ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
అనంతరం పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ.. మహేశ్వరం అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనే సాధ్యమని గ్రహించి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం జనరల్ సెక్రటరీ మురుకుంట్ల అరవింద్ శర్మ, పార్టీ ఆర్కేపురం అధ్యక్షులు పెండ్యాల నాగేశ్, సాజిద్, లాల్ మహ్మద్, గొడుగు శ్రీనివాస్, రామాచారి, లింగస్వామి గౌడ్, కంచర్ల శేఖర్, జగన్మోహన్రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్‌రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, వెంకటేశ్ గౌడ్, శ్రీరాములు, రమేశ్ కురుమ, దేవేందర్, ఇతర నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.