మహేశ్వరం, సెప్టెంబర్ 29: సీఎం రిలీఫ్‌ఫండ్ నిరుపేదలకు వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరం గ్రామానికి చెందిన బి. శంకరయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతడికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.41వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మైనారిటీ నాయకుడు ఎస్కే ఆజాం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్‌ఫండ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్ తెలిపారు. మహేశ్వరం గ్రామానికి చెందిన పార్వతమ్మకు రూ.45వేలు, శేఖర్‌కు రూ.10,500, బాబుకు రూ.42,500 ప్రభుత్వం నుచి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో- ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డు కృష్ణ యాదవ్, నాయకులు మునగపాటి నవీన్, ఎస్కే ఆజాం తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం ముస్లిం సంఘానికి 400 గజాల స్థలాన్ని కేటాయించడాన్ని హర్షిస్తూ.. శుక్రవారం మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సబ్బండవర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. అనంతరం ముస్లిం సంఘం నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముస్లిం సంఘం అధ్యక్షుడు అబ్దుల్ సమీర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ముస్లిం మండల అధ్యక్షుడు హాజీబాబ, నాయకులు ఎస్కే ఆజాం, జలాలుద్దీన్, నయీంఖాన్, ఫరీద్, షేక్ అహ్మద్, వివిధ గ్రామాల ముస్లిం సంఘం నాయకులు పాల్గొన్నారు.
నేడు మహేశ్వరం మండల పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి హాజరు కానున్నారని ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్ అన్నారు. నేడు ఉదయం 10 గంటలకు జరిగే వివిధ కార్యక్రమాలకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.