బడంగ్‌పేట, అక్టోబర్ 28: మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి.. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజీర్టీతో గెలిపించండని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీర్‌పేటలో శనివారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలగాన్ని చూసి.. ఢిల్లీ గులాంలు భయపడుతున్నారని.. సబితమ్మపై పోటీ చేయడానికి ఎవరిని పెట్టాలో ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయంటే ఎంత భయం ఉందో అర్థం అవుతుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజా సంక్షేమనికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించే బాధ్యత తనదేనన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేశామని. తప్పుడు ఆరోపణలు చేసిన వారికి ఓటు ద్వారా ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి సిద్దాల బీరప్ప, అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల లావణ్య, నవీన్ గౌడ్, గజ్జల రాంచందర్, బాలమణి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేశ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్, శ్రీను నాయక్, ఆర్.నర్సిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.