ఆర్కేపురం, మే 8: బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కుర్మమల్గూడలో బ్రాహ్మణ భవనానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించడాన్ని హర్షిస్తూ సోమవారం ఆర్కేపురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక, శ్రీవేద భారతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అరవింద్‌శర్మ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచీతం శ్రీధర్‌తో కలిసి మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గంలో అత్యధికంగా బ్రాహ్మణులు నివసిస్తున్నారని, వారి కోసం బ్రాహ్మణ భవనానికి స్థలం కేటాయించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డిని కోరడంతో స్పందించి భవన నిర్మాణం కోసం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించారని వారు తెలిపారు. నియోజకవర్గంలో బ్రాహ్మణులకు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని, రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణులంతా ఏకతాటిపైకి వచ్చి మంత్రి సబితకు ఓటు వేయాలన్నారు. బ్రాహ్మణుల కోసం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించినందుకు మంత్రికి బ్రహ్మణుల పక్షాన అరవింద్‌శర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి సబితాఇంద్రారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ మంగు రాఘవరావు, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కోటార్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పంతంగి మాధవి, తులసి శ్రీనివాస్, మునిపల్లె శ్రీనివాస్, ప్రకాశ్, మధుసూదన్‌రావు, యాదగిరిరావు, రఘునందన్‌రావు, రాజేశ్వరశర్మ, శ్యాంసుందర్, రమాశంకర్, బొడ్డుపల్లి రామ్మోణ్రావు, తాటికొండ అనురాధ తదితరులు పాల్గొన్నారు.