హైదరాబాద్ : ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన మేరకు ఫిబ్రవరి 17 కులగణన సర్వే కోసం శాసనసభ లో తీర్మానం చేశాం. క్యాబినెట్ ఆమోదంతో జీవో నెంబర్ 18 ద్వారా సమగ్ర కుల గణన సర్వే చేయడానికి ప్లానింగ్ కమిషన్‌కు ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam )అన్నారు. సోమవారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య భవన్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
భవిష్యత్‌లో బలహీన వర్గాలకు(Weaker sections) ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, ఈబీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ద్వారా కుల వృత్తులు ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు.