సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లా అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 24న కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించి సోమవారం సంబంధిత జిల్లా అధికారులు అన్ని ఫైళ్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వారిని ఆదేశించారు.
ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ముందస్తు సమీక్ష సమావేశం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకటాచారి, ఆర్డీవో సూర్యప్రకాశ్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.