సిటీబ్యూరో: ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విసృ్తత ఏర్పాట్లు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న గోలొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయన్నారు. జూలై 20, 21, 22 తేదీల్లో బలంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాల్లో భాగంగా 20న బలంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదురోలు ఉత్సవం, 21న అమ్మవారి కల్యాణం, 22న రథోత్సవం జరగనుందన్నారు.
ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం, ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు, ప్రధాన దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 3,427 దేవాలయాలకు బోనాల ఉత్సవాల కోసం రూ. 15.5 కోట్లు 15 కోట్ల 5 లక్షల 41 వేల 150 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి పేరొన్నారు.