నెక్లెస్ రోడ్డులో సోమవారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బల్దియా కమిషనర్ ఆమ్రపాలితో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్‌ను ఆదేశించారు.
గణేశ్ నిమజ్జనానికి బల్దియా విస్తృత ఏర్పాట్లు చేసింది. 73 లొకేషన్లలో బేబి పాండ్లను ఏర్పాటు చేశాం. 172 రోడ్ల నిర్వహణ, 36 ట్రాన్స్పోర్ట్ పనులు, 140 స్టాటిక్, 295 మొబైల్ క్రేన్ల ఏర్పాటు, 169 గణేశ్ యాక్షన్ టీమ్స్, 309 మొబైల్ టాయిలెట్స్, 52,270 తాతాలిక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశాం.
గణేశ్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 15 వేల మంది మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు భక్తులకు సేవలందిస్తారు. గ్రేటర్ వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనం నేపథ్యంలో 10 కంట్రోల్ రూంలు, కమాండ్ కంట్రోల్ రూంలో అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులతో మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాం.