జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పాత్రికేయులు పనిచేయాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో సైబరాబాద్ ప్రెస్ క్లబ్ లోగోను ఆయన ఆవిష్కరించారు.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పాత్రికేయులు పనిచేయాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో సైబరాబాద్ ప్రెస్ క్లబ్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
మాదాపూర్ కేంద్రంగా సైబరాబాద్ ప్రెస్‌క్లబ్ (హైటెక్ సిటీ) త్వరలో ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధకృష్ణ తెలిపారు. రాజధాని నగరంలోని పాత్రికేయుల సంక్షేమం కోసం సైబరాబాద్ ప్రెస్‌క్లబ్ పనిచేస్తుందన్నారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు వై.విశ్వనాథ్, కార్యదర్శి ఎం.కిరణ్‌కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, ట్రెజరర్ దుర్గాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

