మేడ్చల్, నవంబరు 16: మేడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రచారం గురువారం జోరుగా సాగింది. చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డితో పాటు కౌన్సిలర్లు, నాయకులు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తూ జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై మల్లన్న, కారుకు గుర్తుకు ఓటేయాలని నినదించారు. అలాగే ఓటర్లను కలుస్తూ బీఆర్ఎస్కు ఓటేస్తే కలిగే లాభాలను, కాంగ్రెస్ ఓటేస్తే కలిగిన నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు ప్రజల బతుకులు బాగు చేయడం ఒక్క కేసీఆర్‌కు సాధ్యమని, కాంగ్రెస్ ఓటేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని,మల్లారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.
శామీర్‌పేట: శామీర్‌పేట మండలంలోని బొమ్మరాశిపేట, శామీర్‌పేట, అలియాబాద్, మజీద్‌పూర్, లాల్‌గడి మలక్‌పేట, తూంకుంట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్‌లు గీతమహేందర్, గుర్క కుమార్‌యాదవ్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు నందుగౌడ్, శ్రీనివాస్, రవికిరణ్‌రెడ్డి, నర్సింగ్, కుమార్, రాజు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, లింగం, బాలేశ్, రాజు, నాగేశ్, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలంలోని నూతన్‌కల్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి కోడలు శాలిని స్థానిక నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మంత్రి మల్లారెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు నిరంతరం కొనసాగాలంటే సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందారెడ్డి, సర్పంచ్ కవితా జీవన్, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, కో ఆప్షన్ సభ్యురాలు రుక్సానా, డబిల్పూర్ పీఏసీఎస్ చైర్మన్ సురేష్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు భాస్కర్, నిషిత, గీత, భవానీ పాల్గొన్నారు.