కీసర,ఏప్రిల్ 20:తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం యాద్గార్‌పల్లిలోని శుభం గార్డెన్లో గురువారం ముస్లింల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో కీసర ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, మండల కోఆప్షన్ సభ్యులు బషారత్ అలీ, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండీ.ఖలీల్, తిమ్మాయిపల్లి సర్పంచ్ పెంటయ్య, యాద్గార్పల్లి ఎంపీటీసీ వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు,వార్డు సభ్యులు, ముస్లింలు పాల్గొన్నారు.
తుర్కపల్లిలో ..
శామీర్‌పేట,ఏప్రిల్20: రంజాన్ సందర్భంగా ప్రభు త్వం ఆధ్వర్యంలో శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రంజాన్ కానులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లాడ్డి ఒక్కపొద్దు విడిపించి, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.జహంగీర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జడ్పీటీసీ అనితలాలయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ కో ఆఫ్షన్ సభ్యుడు జహీరుద్ధిన్, ఆర్ఐ కుమార్, వీఆర్ఏ సత్యనారాయణ, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, సర్పంచ్ కుమార్‌యాదవ్, ముస్లీం సోదరులు నవాస్, యూసఫ్, అజ్జు, ఇమ్రాన్, అఫ్జల్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేటలో..
శామీర్‌పేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు మహ్మద్‌ఖాన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మల్కాజీగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందు చేశారు. ఈ కార్యక్రమంలో నజీర్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, ఉపసర్పంచ్ రమేశ్‌యాదవ్, బాబు, నర్సింహారెడ్డి, ఉప్పలయ్య, రవీందర్; నవీన్ముదిరాజ్, వెంకటేశ్, ఆంజనేయులు, చందర్‌గౌడ్, శ్రీనివాస్, అజ్మత్, కుమార్ పాల్గొన్నారు.
అవుషాపూర్‌లో..
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 20: మండల పరిధి అవుషాపూర్‌లో గురువారం ప్రభుత్వం అందజేసిన రంజాన్ కానుకలను మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి ముస్లింలకు అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య యాదవ మాజీ సర్పంచ్‌లు భిక్షపతి గౌడ్, రమేశ్, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, రైతు బం ధు సమితి గ్రామశాఖ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్ గౌడ్,వీరేశం, వెంకట్ రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, మల్లేశ్, వినయ్ రెడ్డి, ముస్లింలు ఉన్నారు.
చౌదరిగూడలో..
చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్షిప్లో రం జాన్ సందర్బంగా సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్ రంజాన్ కానుకలను అందజేశారు.
కొర్రెములలో..
మండల పరిధి కొర్రెముల గ్రామంలో పంచాయతీ సభ్యులు ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు దుర్గరాజు గౌడ్, భాస్కర్, బాబు, నాయకులు యాదగిరి, మణ్యం, ముస్లింలు జమీ ల్, ఫాషా, నజీర్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 20: మేడ్చల్ మండలంలో గౌడవెల్లి గ్రామంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు మేడ్చల్ మాజీ ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి ఆధ్వర్యంలో 53 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను గురువా రం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పెంటమ్మ, వార్డు సభ్యులు గణేశ్‌యాదవ్, సుదర్శన్‌రెడ్డి, మీనా రాము, జ్యోతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో ఇఫ్తార్ విందు
మేడ్చల్, ఏప్రిల్ 20: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మహేశ్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు.కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ లాయక్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రఫిక్, మౌల్సాబ్ మౌలానా, నాయకులు యూసుఫ్, జాకీర్, ఉమర్, వాహేద్, జావేద్షేక్ ఇబ్ర హీం, సయ్యద్ అఖిల్, సాబేర్, మాజీద్, షాకీర్, రంజు, ఫెరోజ్, సమీర్, అమీర్, సల్మాన్, హైదర్ పాల్గొన్నారు.
రాంపల్లిలో..
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 20:నాగారం,దమ్మాయిగూడ మున్సిపాలిటీ రాంపల్లి వార్డు కార్యాలయం వద్ద ముస్లిం లకు రంజాన్ కిట్లను అందజేశారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్,మేనేజర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు నాగేశ్‌గౌడ్, సరిత, కళావతి, నేతలు షపి, అంజయ్య గౌడ్, అశోక్ గౌడ్, పెట్టయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్లో..
పీర్జాదిగూడ, ఏప్రిల్ 20:రంజాన్‌ను పురస్కరించుకుని గురువారం డివిజన్ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిన రంజాన్ గిప్ట్ ప్యాక్‌లను పీర్జాదిగూడ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ హరిశంకర్‌రెడ్డి పంపిణీ చేశారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు, అనంతరెడ్డి, సుభాష్ నాయక్, నాయకులు రవీందర్ఉన్నారు.