శామీర్‌పేట,నవంబర్6: తెలంగాణకు సంపద పెంచేది సంక్షేమం రూపంలో పేదోళ్లకు పంచేది సీఎం కేసీఆరే అనే విషయాన్ని ప్రజలు మరిచిపోవద్దని మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం తూంకుంట మున్సిపాలిటీలోని తూంకుంట, దేవరయాంజాల్ల్లో సోమవారం మంత్రి రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వ డంలో ఆలస్యం చేసి వంద ల మంది పిల్లల ప్రాణాలను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి అన్నారు.ప్రధానిమోదీ గ్యాస్ సిలిండర్ రేటును రూ.1200లకు పెంచి ప్రజలపై పెనుభారం మోపాడని అన్నారు. ప్రజా సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రజలకు రూ.400 లకే సిలిండర్ ఇస్తారని చెప్పారు. 18ఏండ్లు నిండిన ప్రతి మహిళకు బీమాను మార్చి నుంచి అమలు చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీని రూ.15 లక్షలు పెంచడంతో పాటు రైతుబంధు రూ.10 వేల నుంచి రూ.16వేలకు పెంచడం జరుగుతుందని, పింఛన్ రూ.2వేల నుంచి వచ్చే ఏడాది రూ.3వేలు, మూడేండ్లలో రూ.5 వేలు చేస్తామన్నారు. ఇలా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి ప్రజల మనిషి, సంక్షేమానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ను గెలిపించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు పాండు, రాజ్కుమార్యాదవ్, సురేశ్, హరిబాబుగౌడ్, నర్సింగ్‌రావు, ఉమశ్రీనివాస్, నర్సింగ్‌గౌడ్, యాదమ్మనర్సింగ్, మాజీ ఎంపీపీలు చంద్రశేఖర్‌యాదవ్, నాలిక యాదగిరి, కో ఆఫ్షన్ సభ్యుడు షఫీఉల్లాబేక్, శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ సునీతాలక్ష్మి, పార్టీ నాయకులు ప్రవీణ్‌గౌడ్, కృష్ణారెడ్డి, మహేశ్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, హనుమాన్‌దాస్, నర్సింహారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలేసినట్లే
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని మంత్రి అన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని మంత్రి అన్నారు. దేవరయాంజాల్‌లో నిర్వహించిన రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీరు, కరెంటు ఇవ్వకుండా ప్రజల ఊసురుపోసుకున్నారని అన్నారు.కానీ తెలంగాణ ప్రభు త్వం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇం టింటికీ నల్లా నీరు, విద్యుత్, ఆసరా పింఛన్ వంటి ఎన్నో కార్యక్రమాలతో ప్రజలు అవసరాలను ఎప్పటికిప్పుడు తీరుస్తూ వస్తున్నాడని తెలిపారు. ఈ ఊరు ప్రజలకు గుర్తుందో లేదో అప్పుడు దేవరయాంజాల్ ఊళ్ళకు పిల్లను ఇవ్వలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడు తొవ్వని బాయి లేదు, వేయని బోరు లేదు నీటికి కటకట ఉండేదే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గోదావరి కృష్ణ నీటిని ఇంటింటికీ తీసుకురావడం జరిగిందన్నారు. 46వేల చెరువులు ఎండకాలంలో కూడా నిండు కుండలాకళకళలాడుతున్నాయన్నారు.