మంత్రి చామకూర మల్లారెడ్డి
జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా అవుషాపూర్‌లో విగ్రహావిష్కరణ
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 5 : ప్రతి దళితుడిని ధనవంతుడిగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అవుషాపూర్‌లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వైయస్ రెడ్డి ట్రస్టీ ద్వారా బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ దళితులకు పెద్దపీట వేశారని తెలిపారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని 100 మంది దళితుల ఖాతాల్లోకి రూ. 10 లక్షలు మంగళవారం జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా మార్చుకుని పదవులు దక్కించుకున్న ఏ నాయకుడూ వారి కోసం పని చేయలేదని, సీఎం కేసీఆర్ మాత్రమే దళితుల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయ సాధనలో యువత పయనించాలని సూచించారు. అంతకుముందు స్థానికంగా ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ పార్కును మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కావేరి, వైస్ ఎంపీపీ జంగమ్మ, మున్సిపల్ చైర్మన్ పావనీ, కౌన్సిలర్ రమాదేవి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, మండల రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యంనంపేట్ చౌరస్తాలో…
ఘట్కేసర్ : జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మంగళవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట్ చౌరస్తాలోని విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి , మున్సిపల్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతుసంఘం చైర్మన్ రాంరెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు కె.పద్మారెడ్డి, ఎస్.శ్రీనివాస్‌గౌడ్, ఎం.జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు కె.మల్లేశ్, పద్మారావు, సంగీత, రవీందర్, దళిత నాయకులు నాగేశ్, జంగయ్య, రాజేశ్ పాల్గొన్నారు.